నరసింహావతారం Narasimha avatharam
|
పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు ప్రారంభించి అనేక
సంవత్సరములు గడిచాయి. అతని తపోదీక్షకు సర్వలోకాలలోను మంటలు వ్యాపించి
దేవతాదులందరు బ్రహ్మదేవ్ఞని వద్దకు పరుగెత్తి, అతని తపోదీక్ష మానిపించమని
వేడుకున్నారు. ఎట్టకేలకు బ్రహ్మ ప్రత్యక్షమై, దానవేంద్రా! నీ తపస్సుకు
మెచ్చాను. ఏంకావాలో కోరుకో! అన్నాడు. హిరణ్యకశిపుడు ఎంత బలవంతులైనా వరబల
సంపను్నలైనా, తన పూర్వీకులైన రాక్షసులందరిని శ్రీహరి ఏదోవిధంగా
చంపుతున్నాడని శ్రీహరి మాయోపాయాలకు లొంగని విధంగా ఉండేలా విచిత్రమైన వరాలు
కోరాడు. అవి తాను నరులచేతగాని, పగలుగాని, రాత్రిగాని, ఇంటిలోగాని, బయటగాని,
ఆకాశంలోగాని, భూమిపైగాని ఎవరిచేతా మరణం లేకుండా ఉండాలని కోరాడు. అలవాటుగా
బ్రహ్మ తథాస్తు అని మాయమైపోయాడు. ఆ వరబల గర్వంతో విర్రవీగుతూ దేవతలను,
సర్వలోకాలను వేధించసాగాడు దానవ్ఞడు. ఎవడురా మీకు దిక్కు, ఎక్కడరా శ్రీహరి.
ఏడిరా చూపండి, అంటూ భక్తులను,మునులను వేధిస్తూ యజÑయాగాదులు ధ్వంసం చేయిస్తూ
ఎల్లరకు కంటనిద్రలేకుండా చేయసాగాడు. కన్న కుమారుడైన ప్రహ్లాదుని సైతం
హరిభక్తి మాను లేదా ఉంటే ఆ హరిని చూపమంటూ వేధించసాగాడు. హిరణ్యకశిపుడు
హాహాకారాలకు దిక్కులకు అధిపతులైన దేవతలు దిక్కుతోచక తలోదారి
పరుగులెత్తారు. వైకుంఠం చేరి శ్రీహరిని చూసి, హిరణ్యకశిపుని బారి నుండి
మమ్ములను రక్షింపమని వేడుకున్నారు. నారదుడు సమయం దొరికినప్పుడల్లా హిరణ్యకశిపుని కనిపించి రాక్షసాధిపా! ఆ శ్రీహరికి నీకుమారుడు ప్రహ్లాదుని మీద నీకంటే కూడా ఎక్కువ ప్రేమ. తరచు అతడు నీకుమారుని దర్శించటానికి ఇక్కడికే వచ్చి నీ నగరంలోనే ప్రహ్లాదుని ముందు ఉంటాడు. అతనికోసం నీవ్ఞ ఎక్కడెక్కడో చూడక్కర్లేదు. ఇక్కడే నీ నగరంలోనే దొరుకుతాడు. నువ్ఞ్వ కన్న కుమారుడన్న ప్రేమ వదలి నీ కుమారుని దండించినట్లయితే ఆ శ్రీహరి జాడ నీకు ప్రహ్లాదుడే చెబుతాడు అంటూ పురి ఎక్కించసాగాడు. ఒకనాడు అలా శ్రీహరి పై ద్వేషంతో కన్న కుమారుడిని దండిస్తూ, ఎక్కడరా, శ్రీహరి ఇక్కడ ఉన్నాడా, అని ఎదుటనున్న స్తంభాన్ని గద ఎత్తి గట్టిగా మోదాడు హిరణ్యకశిపుడు. ఆనాటితో హిరణ్యకశిపుని ఆయుర్థాయం ముగిసిపోవడంతో ఆ స్తంభం పడదోసుకుని, పగలు కాని, రాత్రిగాని సంధ్యాసమంలో సగం నరుడు, సగం మ]గంగా రూపుదాల్చి జూలు విదుల్చుకుని నరసింహుడుగా మారి గర్జిస్తూ శ్రీహరి వింతరూపంతో ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుని చేతులతో పట్టి పైకి ఎత్తి లోపలా బయటా కాకుండా గుమ్మం మీద కూర్చుని భూమి మీద ఆకాశంలో కాకుండా తొడలమీద పరుండబెట్టుకొని గోళ్లనే ఆయుధములుగా చేసుకుని పొట్ల చీల్చి చంపివేశాడు. శ్రీహరి ఆ దుష్టరాక్షసుని మరణంతో దేవతలు, మానవ్ఞలు, సర్వజాతులు, లోకాలు ఆనందంతో పొంగిపోయాయి. శ్రీహరిని వేనోళ్లతో కొనియాడారు. శ్రీవారి మీద పుష్పవర్షం కురిపించారు. అలా బ్రహ్మ వరాలకు భంగం రాకుండా హిరణ్యకశిపుని సంహరించి లోకాలకు మేలు కలుగజేశాడు శ్రీహరి. హిరణ్యకశిపుని చంపటానికి శ్రీహరి ఎత్తిన అవతారమే నరసింహం. అతడే నరుడూ-నారాయణుడు. |
Narasimha Avatar is the Half-Man Half-Lion
Incarnation of Hindu God Sri Hari Vishnu. The story of Narasimha Avatar
is associated with Vishnu’s incarnation as the boar or Varaha. To uphold
dharma and save the Vedas, Varaha had killed the brother of demon
Hiranyakashipu.
To
avenge his brother’s death, Hiranyakashipu performed intense
austerities and was able to please Hindu God Brahma. When Brahma
appeared before him he asked for immortality. But Brahma said he could
not grant him the boon of immortality.
So Hiranyakashipu played a trick on Brahma and asked a series of boons all of which indirectly tried to avoid death.
Hiranyakashipu demanded the following boons –
He will not die in any type of residence or outside.
He will not die during day or night.
He will not die on earth or sky
He will not be killed by any weapon
He will not be killed by a human being of animal
After
earning the boons, Hiranyakashipu defeated demigods and rulers on earth
and announced that he was God and all prayers should be directed to him
and not to Sri Hari Vishnu.
The entire kingdom followed his commands but not his young son, Prahlad.
The
little boy Prahlad worshipped Sri Hari Vishnu. Hiranyakashipu tried all
means to make the boy worship Him. But all this efforts failed. Then
the demon tried to kill his sons but each time the little boy was
rescued by Vishnu.
Fed
up with his son’s Vishnu worship, Hiranyakashipu demanded to him to
show him his Vishnu who is present everywhere. In a fit of anger
pointing to a pillar, Hiranyakashipu asked whether Vishnu is present in
it. Young Prahlad said yes and Hiranyakashipu took out his sword to cut
the pillar.
Suddenly,
Narasimha broke opened the pillar and appeared before Hiranyakashipu.
Narasimha then dragged him to the doorway of the palace and when the
twilight period approached put him in His lap and killed him with His
finger nails. Thus the boons failed to protect Hiranyakashipu.
|
1 comment:
Mr Reddy reminds us the story nicely in his blog!
Let us realize,one point good is overtaken by bad,now a days,
one important point for this is bad people join hands ,where as good persons keep away from each other!
Let good persons join hands!
Then see how it makes a difference!
KLRao( Colleague of KLNReddy at Vizag)
Post a Comment